Posts

తొలి ప్రేమ ( మౌన రాగం )

Image
           నా పెరు భాస్కర్ , నేను 10 వరకూ గవర్నమెంట్  స్కూల్ లోనె చదివాను. నాకు 10 అయ్యె సరికి నా వయస్సు 14 సంవత్సరాలే. నా స్నేహితులలొ చాల మంది నా కన్న పెద్దవారే ఉండేవారు.  10 అయిన తరువాత డిప్లొమా ఎంట్రన్స్ రాసాను. మంచి రాంక్ వచ్చింది.  నాకు చిన్నప్పటి నుండి computers అంటే ఇష్టం ఉండేది.  మా ఊరు కాలేజీ లొ సీట్స్ లేకపొవడం వలన ఏలూరు లో జాయిన్ అయ్యను.  కాని ఇంటి నుండి దూరంగా ఉన్నాను అన్న బాధ ఎక్కువ ఉండేది. ఎప్పుడు ఇంటికి వెళదాము అన్న ధ్యాసే ఎక్కువగా ఉండేది. చిన్న పిల్ల వాడిని కదా , లోకం పోకడ తెలియని వాడిని.  సంక్రాంతి కి సెలవలు ఇచ్చారు.  ఇంటికి వెళ్ళుతున్నా అనే ఆనందం వర్ణించలేనిది.  పాసింజర్ త్రైన్ ప్రయాణం మరచి పొలెను . చిన్న చిన్న ఊర్లు కూడా ఆగేది. ఇంటికి వచ్చెసరికి ఒల్లు హూనం అయ్యి పడుకుండి పోయాను.  మద్యాహ్నం బొజనం చేసి మళ్లీ పడక.  సాయంత్రం 5 గంటలు అయ్యింది. రజనీ, శివ, కిరణ్ మా ఇంటికి వచ్చారు.  భాస్కర్ ఎప్పుడు వచ్చావు. ఎలా ఉన్నావు? ఇవే మాటలు. నా స్నేహితులను చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. మేము చిన్నప్పటి నుండి స్నేహితులం. బాల్,  బాట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే, కొబ్బరి మట్ట బా