తొలి ప్రేమ ( మౌన రాగం )

           నా పెరు భాస్కర్ , నేను 10 వరకూ గవర్నమెంట్  స్కూల్ లోనె చదివాను. నాకు 10 అయ్యె సరికి నా వయస్సు 14 సంవత్సరాలే. నా స్నేహితులలొ చాల మంది నా కన్న పెద్దవారే ఉండేవారు.  10 అయిన తరువాత డిప్లొమా ఎంట్రన్స్ రాసాను. మంచి రాంక్ వచ్చింది.  నాకు చిన్నప్పటి నుండి computers అంటే ఇష్టం ఉండేది.  మా ఊరు కాలేజీ లొ సీట్స్ లేకపొవడం వలన ఏలూరు లో జాయిన్ అయ్యను.  కాని ఇంటి నుండి దూరంగా ఉన్నాను అన్న బాధ ఎక్కువ ఉండేది. ఎప్పుడు ఇంటికి వెళదాము అన్న ధ్యాసే ఎక్కువగా ఉండేది. చిన్న పిల్ల వాడిని కదా , లోకం పోకడ తెలియని వాడిని. 


సంక్రాంతి కి సెలవలు ఇచ్చారు.  ఇంటికి వెళ్ళుతున్నా అనే ఆనందం వర్ణించలేనిది.  పాసింజర్ త్రైన్ ప్రయాణం మరచి పొలెను . చిన్న చిన్న ఊర్లు కూడా ఆగేది. ఇంటికి వచ్చెసరికి ఒల్లు హూనం అయ్యి పడుకుండి పోయాను.  మద్యాహ్నం బొజనం చేసి మళ్లీ పడక.  సాయంత్రం 5 గంటలు అయ్యింది. రజనీ, శివ, కిరణ్ మా ఇంటికి వచ్చారు. 

భాస్కర్ ఎప్పుడు వచ్చావు. ఎలా ఉన్నావు? ఇవే మాటలు. నా స్నేహితులను చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. మేము చిన్నప్పటి నుండి స్నేహితులం. బాల్,  బాట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే, కొబ్బరి మట్ట బాట్ లా వా డే వాళ్ళం. సైకిల్ ట్యూబ్ నీ సన్నటి రింగులు లా కోసి ఒక రాయిని కాగితం లో చుట్టి దానిపై ఒక రింగు తరువాత ఒకటి పెట్టీ బాల్ లా చేసుకుని క్రికెట్ ఆడేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ అనందాలే వేరు. 


ఇప్పుడు పెద్ద వాళ్ళం అయ్యం కదా. కొత్త బాట్, బాల్ , వికెట్లు కొనుకున్నాం. 





అల్లరి ప్రియుడు సినిమా

ఏలూరు కాలేజ్ దగ్గర రూం కి వచ్చేసాను. కాలేజీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళతాను అని ఒకటే బెంగ. స్నేహితులతో ఎప్పుడు కలుస్తాను, మళ్ళీ క్రికెట్ ఎప్పుడు ఆడతాను. మళ్ళీ ఆమెను ఎప్పుడు చూస్తాను అన్న ఆలోచనలే ఎక్కువ వచ్చేవి. ఒక రోజు మా ఫ్రెండ్ వచ్చి ఏలూరు విజయలక్ష్మి థియేటర్ లో అల్లరి ప్రియుడు సినిమా ఆడుతుంది , వెళదామా అని అన్నాడు. నాకు సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా లేదు. నేను రానని చెప్పినా ఊరుకోలేదు. పట్టు పట్టి రమ్మన్నాడు. నేను వెళ్ళక తప్పలేదు. 

సినిమా చాలా బాగుంది. అందులో రమ్యకృష్ణ కవితలు రాయడం నాకు చాలా నచ్చింది. నేను ఎందుకు try చెయ్యకూడదు అనిపించింది. ప్రేమించిన అమ్మాయి కూడా మనసులో ఉంది. ఇంతకన్నా బలమైన కారణం ఏమి కావాలి. అప్పటి నుండి చిన్న, చిన్న కవితలు రాయడం మొదలు పెట్టాను. నా కవితలకు స్ఫూర్తి ఆమెనే( ఇంకా పేరు తెలీదు).

తన కోసం రాసిన మొదటి కవిత

ప్రణయ కావ్యం


హ్రుదయం లో పరిచయాన్ని
నా కలం లో సిరా గా నింపుకున్నా

పరిచయ అక్షరాల అభిమానాన్ని
ప్రేమ అనే పదాలుగా రాస్తున్నా

ప్రేమ పదాల వాఖ్యాన్ని
ప్రణయ కావ్యం గా రూపోందించుకుంటున్నా.

హరి తో పరిచయం

మూడు రోజులు కాలేజీకి సెలవలు వచ్చాయి. ఆదివారం తో కలసి అయిదు రోజులు సెలవలు .ప్యాసింజర్ ట్రైన్ టికెట్ చాలా తక్కువ గా ఉండేది. అందుకే ఇలా 4, 5 రోజులు సెలవలు వచ్చేస్తే ఇంటికి వచ్చే వాడిని. ఇంటికి వచ్చాను , మళ్ళీ క్రికెట్ మొదలు. ఈ సారి కొత్త అబ్బాయి వచ్చాడు టీం లోకి. పేరు హరి. మలయాళం అబ్బాయి. కొంచెం డబ్బు గల అబ్బాయి. క్రికెట్ కిట్ అంతా ఉండేది. ఒక చిన్న  idea వచ్చింది. ఈ అబ్బాయిని పరిచయం చేసుకుంటే , ఆ పై అంతస్తులో ఉన్న అమ్మాయి గురించి బాగా తెలుసు కోవచ్చు అని. ప్లాన్ వర్క్ ఔట్ అయ్యింది.

హరి పరిచయం అయ్యాడు. ఇంటికి కూడా పిలిచాడు. నేను తన గురించి అడిగాను. ఆ అమ్మాయి పేరు ఏంటి అని. హరి ఆ ఆమ్మాయి పేరు పింకీ సింగ్ అని చెప్పాడు. పింకీ పేరు చాలా బాగుంది కదా. పంజాబీ వాళ్ళు. పెద్ద ఫ్యామిలీ , ఈ అమ్మాయి పింకీ చిన్న అమ్మాయి అనుకుంటా అని అన్నాడు. 

నాకు హిందీ కానీ, పంజాబీ కానీ రాదు. ఆ అమ్మాయికి తెలుగు వచ్చో లేదో తెలీదు. ఎలా మాట్లాడాలి రా దేవుడా అని మనసులో అనుకున్నా. ప్రేమను వ్యక్తపరచడానికి భాష తో పని ఏముంది? 

ఇంకా నా లక్ష్యం పింకీ ఎప్పుడు క్రిందకు వచ్చినా మాట్లాడడమే. ఉదయం పూట హరి ఇంటి ముందు క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఎప్పుడు చూసినా వాళ్ళ అక్క, అన్నయ్య లే కనిపించే వారు. ఇక్కడ ఎందుకు క్రికెట్ ఆడుతున్నారు. మా స్కూటర్ అద్దాలు, లైట్స్ పగిలి పోతాయి. అని అనేవారు. ఐదు రోజుల నిరీక్షణ .దగ్గర నుండి చూడాలి తనతో మాట్లాడాలి అని అనిపించింది.  పింకీ ఎప్పుడూ కిందకి రాలేదు. నా ఆశ నిరాశ గానే మిగిలి పోయింది. 


హిందీ నేర్చుకోవడం.

నాకు హిందీ నేర్చుకోవాలి . కవితలు రాయాలి. పింకీ నీ ఇంప్రెస్స్ చేయాలి అన్న కోరిక బాగా ఉండేది. మా రూం మేట్ పేరు అలి. హిందీ బాగా వచ్చు. నాకు 10 th లొ హిందీ సబ్జెక్ట్ ఉండేది కానీ. అంతగా ఎక్కువగా రాదు. అలి నాకు తొందరగా హిందీ నేర్పించాడు. ఎంతగా అంటే హిందీలో చిన్న చిన్న కవితలు రాసేవాడిని. అలా హిందీ నేర్చుకున్నాను.


వేసవి సెలవలు

స్నేహితులకి తెలిసి పోవడం


వేసవి సెలవులు ఇచ్చేసారు. ఇంటికి వెళ్తున్నాను అన్న ఆనందం ఎక్కువయ్యింది. క్రికెట్ ఆడుతాను కదా. పనిలో పనిగా పింకీ నీ కూడా చూడొచ్చు. ఆ సాయంత్రం క్రికెట్ ఆడుతున్నాం. వికెట్ కీపర్ భా చేస్తున్నాను. పింకీ కిటికీ దగ్గర ఉంది. నేను తనను అలా చూస్తూ వుండిపోయాను. పట్ట వలసిన కాచ్ పట్టలేదు. నా గురించి మా ఫ్రెండ్స్ కి తెలిసి పోయింది. అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవారు. 

వాటర్ ట్యాంకర్

మా ఊరిలో నీటికి ఇబ్బంది ఉండేది. మున్సిపాలిటీ వాటర్ టాంక్ వచ్చేది. సాయంత్రం టాంకర్ వచ్చినప్పుడు మేము క్రికెట్ ఆపే వాళ్ళం. బాల్ ఎవరికైనా తగులుతుంది ఏమో నని. పింకీ వాళ్ళ ప్రహరీ గోడ ఎక్కి కూర్చున్నాము. నేను మా ఫ్రెండ్స్. ఎప్పుడూ రాని పింకీ ఆ రోజు నీళ్ళు పట్టడానికి వచ్చింది. నాకు చాలా ఆనందంగా అలజడి గా ఉంది మనస్సు. చాలా రోజుల తరువాత దగ్గరి నుండి చూడడం వలన. తడసిన వస్త్రాలతో ఆమె నాకు ఒక దేవకన్య లా కనిపించింది. బయట అందాలే కాదు, లోపల దాగిన అందాలు కూడా కనిపించాయి. ప్రేమించిన అమ్మాయిని అలా చూడడం తప్పు అని తెలుసు కాని అకస్మాత్తుగా ఎలా జరిగి పోయింది.  నాకు ఆ రోజు రాత్రి తీయటి కల వచ్చింది. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. 

తన కోసం రాసుకున్న కవిత



నేను చదువుతుంది డిప్లొమా , తను చదువుతుంది intermediate అదెలా సాద్యం అయ్యింది అనుకుంటున్నారా? పింకీ tutio మాస్టర్ నాకు చిన్నప్పుడు నుండి తెలుసు. నేను final year ప్రాజెక్ట్ financial management మీద డౌట్స్ ఉన్నాయి అని అడిగాను. ఆ గురువు గారు ఒక సారి commerce subject లో అవే చెబుతున్నాను. క్లాస్ కి వచ్చెయ్ అని అన్నారు. 

నాకు ఆనందం పట్టలేదు. పింకీ నీ ఇంకా దగ్గర నుండి చూడొచ్చు. మాట్లాడొచ్చు . నా ప్రేమను చెప్పొచ్చు. థాంక్స్ మాస్టారు గారు. ఆ రోజు రాత్రి tution కు వచ్చాను. పింకీ కూడా వచ్చింది. ఇంత దగ్గరగా ఆమెను ఎప్పుడూ చూడలేదు. తదేకంగా చూస్తే అనుమానం వచ్చేస్తుంది అని ఎక్కువగా చూడలేదు. తన చిరునవ్వు చాలా బాగుంటుంది పూతకు వచ్చిన మామి చిగురులా, ఆమె మాటలు పోట సినిమాలో హిందీ పాటలు లా అనిపించేవి. కానీ ఆమెతో మాట్లాడాలని అంటే భయం ఉండేది ఎందుకో తెలీదు. 

ఒక రోజు tution ఆయి పోయిన తరువాత ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాను. నా వెనుక ఉన్న ఒక అమ్మాయి మాటలు చాలా స్పష్టంగా వినిపించాయి. 

"ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ చెప్ప లేక పోతుంది" 

అని ఓ అమ్మాయి అన్నది. ఎవరో తెలియదు. ఎందుకు అన్నారో తెలియదు.  నేను పింకీ వాళ్ళ ఫ్రెండ్ యే అని అన్నది. పింకీ గురించి అని అనుకున్నాను. కానీ కాదు. 


10 రోజులు అయిపోయాయి. అందులో 5 రోజులు వచ్చి ఉంటుంది. మిగతా రోజులు రాలేదు. ఒకసారి tution అయిన తరువాత మాట్లాడుదాం అనుకున్నాను. వాళ్ళ అన్నయ వచ్చేశాడు. లేట్ అయిపోయింది అని . ఆ అవకాశం అలా పోయింది. ఆమె పై ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరూ అందంగా కనపడడం లేదు. ఆమె తప్ప. ఏ ఆలోచనలు రావడం లేదు. ఆమె ఆలోచనలు తప్ప.

చదువు అయిపోయింది.

నా చదువు అయిపోయింది. అప్పట్లో software ఉద్యోగాలు అంత ఉండేవి కావు. ఒక కంప్యూటర్ సెంటర్ లో లాబ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. చాలా తక్కువ జీతం. అయినా కొత్త కొత్త సబ్జెక్ట్ లు నేర్చుకుంటున్నాను అనే ఆనందం ఎక్కువ ఉండేది. నాకు hardware ఉద్యోగం చేయాలి అని ఉండేది. అలా 5 నెలలు గడచపోయాయి. 

కంప్యూటర్ హార్డ్వేర్ ఉద్యోగం

మా చుట్టాలు వాళ్ళకి ఒకతను పరిచయం ఉన్నాడు. తను కంప్యూటర్ sales and service షాప్ ఉండేది. వాళ్ళు తనని అడిగారు. నన్ను జాయిన్ చేసుకోమని. తను కొన్నిరోజుల తరువాత ఒప్పుకున్నాడు. Service engineer గా జాయిన్ అయ్యాను. 

కొన్ని నెలలు గడిచాయి. Hardware లో నాకు ఆనందం కలగలేదు. అక్కడ physical work ఎక్కువ. కంప్యూటర్ parts తీసుకు రావడం, అసెంబ్లీ చేయడం. మళ్ళీ వాళ్లకు అందజేయడం. చాలా కష్టం గా అనిపించింది. అయినా మా బాస్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఒక సారి మాటలలో నీవు ఎవరినయిన ప్రేమించావా అని అడిగాడు. నేను పొరపాటున మా వీదిలో ఒక అమ్మాయిని 2 సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాను అని చెప్పాను. పేరు చెప్పమని force చేశాడు. మా ఫ్రెండ్స్ నీ కూడా అడిగాడు అని తెలిసింది. వాళ్లు ఏమి చెప్పలేదు. కానీ ఎలాగోలా తెలిసి పోయింది.  పింకీ  వాళ్ళ అన్నయ్య, మా బాస్  మంచి ఫ్రెండ్స్ అని అప్పుడు తెలిసింది. 

ఆ తరువాత కొన్ని నెలలకు తెలిసింది. మా బాస్ పింకీ వాళ్ళ అన్నయ ఫ్రెండ్ అని. 










Comments